'యజ్ఞం' అనేది హిందూ సంప్రదాయం.వేదంలో యజ్ఞో వై విష్ణుః అని చెబుతారు. విష్ణు స్వరూపంగా భావించే ‘యజ్ఞం’.. ‘యజ దేవపూజయాం’ అనే ధాతువు నుంచి వచ్చింది.
యజ్ఞం చేసేటప్పుడు నెయ్యి, పాలు, ధాన్యం, ఆవు పేడ పిడకలు, జిల్లేడు, మొదుగ, దర్బలు, గరిక , ఆరోగ్యాన్ని ఇచ్చే పలు వృక్షాల కట్టెలు వేస్తారు. ఇవన్నీ దేవుడి కోసం మాత్రమే కాదు....
యజ్ఞగుండం ద్వారా వచ్చే పొగ వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని పోగొట్టి గాలిలో స్వచ్ఛతని పెంచుతాయి. దీనివల్ల అతివృష్టి, అనావృష్టి సమస్యలు రావు.
యజ్ఞ కర్మ చేసే వ్యక్తి మాత్రమే కాదు, ఇల్లు, పరిసరాలు, చుట్టుపక్కల వారుకూడా ఆరోగ్యంగా ఉంటారు.
పంటలు సమృద్ధిగా పండుతాయి. పశుపక్ష్యాదులు బాగుంటాయి.
అంటువ్యాధులు వ్యాపించవు. అనారోగ్యాలు దరిచేరవు. అందుకే మన పురాణాలు, ఇతిహాసాల్లో హోమాలు, యజ్ఞాల ప్రస్తావన తరచుగా కనిపిస్తుంది.
హోమాల్లోని భస్మంతో ఔషధాలు తయారుచేయొచ్చు.
యాగాలు చేసిన తర్వాత వచ్చే భస్మాన్ని పంట భూముల్లో చల్లితే ఎరువుగా ఉపయోగపడుతుంది.
ఈ పొగని మనం పీల్చడం వల్ల అనారోగ్యాలు నయమవుతాయి.
యజ్ఞం దేవుడికోసం కాదు, మనకోసం అన్నది గుర్తించాలంటారు వేదపండితులు.
కాలుష్యాన్ని కొంచెమైనా నియంత్రించి గాలిని ఫిల్టర్ చేసుకోవడం ఎంతో అవసరం అంటారు. అంటే పేరు దేవుడిది, ఫలితం మనదన్నమాట.