వ్యక్తుల స్వభావాన్ని వారి పేర్లలోని ముందు అక్షరాలను బట్టి చెప్పేయొచ్చట. మనలో చాలామంది పేర్లు ‘S’తో మొదలవుతాయి. మరి, వారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామా!
‘S’ అక్షరం గలవారు ఆకర్షనీయంగా ఉంటారు. చాలా త్వరగా ఆకట్టుకుంటారు.
చక్కని సంపాదన, సంతోషం కోసం కష్టపడి పనిచేస్తారు.
వీరికి అందరి ముందు ప్రేమను వ్యక్తం చేయడం ఇష్టం ఉండదు. కానీ, ప్రేమను బయటకు చెప్పకుండానే మనసు దోచేస్తారు.
వైవాహిక జీవితానికి విలువనిస్తారు. భార్య, పిల్లలను ప్రేమగా చూసుకుంటారు.
సంఖ్య శాస్త్రం ప్రకారం.. S అంటే 1. నిజాయితీ, నమ్మకానికి మారుపేరు.
S.. అక్షరం గలవారికి ప్రేమ, దయ ఎక్కువ. సాయం చేయడానికి ముందుంటారు.
వీరిలో కోపం, బాధ బయటకు కనిపించవు. మనోభావాలను బయటపెట్టలేరు.
జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోడానికి ప్రయత్నిస్తారు.
వీరిలో నాయకత్వ గుణాలు ఎక్కువ. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలరు.