భారత జాతిలో స్పూర్తి నింపిన నినాదాలు ఎంతోమంది స్వాతంత్య్రసమరయోధుల పోరాట ఫలితమే మన స్వాత్రంత్య్రం. సుదీర్ఘపోరాటంలో సమరయోధులు జాతిలో స్పూర్తి నింపి ఉద్యమం వైపు నడిపేందుకు తమ శక్తివంతమైన మాటలు, నినాదాలతో ప్రచారం చేశారు. కొన్ని నినాదాలు ఒక్కరితో మొదలై లక్షల మంది గొంతుల్లో ప్రతిధ్వనించాయి. స్పూర్తి నింపిన కొన్ని నినాదాలు... స్వరాజ్యం నా జన్మహక్కు... నేను దాన్ని పొందితీరుతాను - బాల గంగాధర్ తిలక్ అహింసకు మించి ఆయుధం లేదు - మహాత్మగాంధీ మీ రక్తాన్ని ధారపోయండి... మీకు స్వాతంత్య్రాన్ని నేను తెస్తాను - సుభాష్ చంద్ర బోస్ సత్యమేవ జయతే - మదన్ మోహన్ మాలవీయ క్విట్ ఇండియా - యూసుఫ్ మెహెర్ అలీ జై హింద్ - నేతాజీ