డయాబెటిక్ రోగులు ఈ తప్పులు చేయకండి

డయాబెటిక్ రోగులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

డయాబెటిక్ రోగులు తమ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని నియంత్రణలో ఉంచడానికి క్రమం తప్పకుండా తినడం చాలా అవసరం.

రాత్రి ఆహారం తిన్నాక మళ్లీ అల్పాహారం తినేందుకు దాదాపు 8 నుంచి 10 గంటలపాటూ గ్యాప్ వస్తుంది. అందుకే బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడూ స్కిప్ చేయకూడదు.

ఉదయం పూట అల్పాహారం మానేయడం వల్ల రోజంతా మీ రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగానే ఉంటాయి.

జ్యూసులు, స్మూతీలు చేసుకుని తాగడం తగ్గించాలి. నేరుగా పండ్లను తినడం వల్లే చాలా ఆరోగ్యం.

కొవ్వులేని ఆహారాన్నే తినాలి. కొవ్వు పదార్థాల్లో కేలరీలు అధికంగా ఉంటాయి. బరువు పెరిగితే సమస్య మరింత ముదురుతుంది.

కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. కాబట్టి అవి ఉన్న ఆహారాన్ని తినడం తగ్గించాలి.

ప్రాసెస్ చేసిన ఆహారాలో పోషకాలు తక్కువగా, కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి మధుమేహరోగులకు చాలా అనారోగ్యకరం.

వ్యాయామాలు చేయకుండా బద్దకించకండి. రోజూ ఓ గంట సేపు వాకింగ్ లేదా ఇతర ఎక్సర్ సైజులు చేయడం చాలా అవసరం.

చాలా మంది నెలల తరబడి చెకప్ చేయించుకోరు. తరచూ బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Thanks for Reading. UP NEXT

చీరకట్టులో మన తారలు.. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్..

View next story