రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీరు. రుద్రాక్షలు అనేవి శివుని కంటి నుంచి జాలువారిన బిందువులు. రుద్రాక్షలు వాటి ఉపయోగాల గురించి శివపురాణం, దేవీ పురాణం, పద్మ పురాణంలో ప్రధానంగా చర్చించారు.
ఏకముఖి రుద్రాక్ష చాలా విలువైనది. ఎలాంటి మంత్ర తంత్ర ప్రయోగాలను అయినా తిప్పి కొట్టగలదు. దీన్ని ధరించడం వల్ల సిరి సంపదలు, శిరో సంబంధ రోగాలు తగ్గుతాయి.
ద్విముఖి రుద్రాక్షను బ్రహ్మ రుద్రాక్ష అని అంటారు కొందరంటే... అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని మరికొందరు చెబుతారు. ఈ రుద్రాక్ష ధరించడం వల్ల సంతాన ప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపార అభివృద్ధి కలుగుతుందని చెబుతారు. మానసిక సమస్యను దూరం చేస్తుంది.
త్రిముఖి రుద్రాక్ష అదృష్టం,ఐశ్వర్యం కలిసొచ్చేలా చేస్తుందని విశ్వాసం. త్రిముఖి ధరించే కామెర్ల వ్యాధి తగ్గుతుందని, సర్ప దోష నివారణ అవుతుందని చెబుతారు.
చతుర్ముఖి రుద్రాక్ష ధరించేవారు ఏ రంగంలో అయినా రాణిస్తారట. అంతేకాదు..చదువు, ఉద్యోగంలో పనిపై ఏకాగ్రత పెరుగుతుందట.
పంచముఖి రుద్రాక్ష వల్ల అకాలమృత్యునివారణ, గుండె సంబంధిత వ్యాధులు నివారణ అవుతాయట.
షణ్ముఖి రుద్రాక్ష కుమార స్వామి స్వరూపం. దీన్ని ధరిస్తే శక్తి, విజయం, శరీర ధారుఢ్యం, ఆరోగ్యం లభిస్తుందట.
సప్త ముఖి రుద్రాక్ష వల్ల సంపద, కీర్తి, ఉత్తేజం కలుగుతుంది
అష్ట ముఖి రుద్రాక్ష ధరించిన వాపిరివ ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది