పిల్లలు ఎత్తుగా పెరగాలా... అయితే వీటిని తినిపించండి ఎత్తు ఒక వ్యక్తి రూపాన్ని మెరుగుపరుస్తుంది. కొన్ని రకాల ఉద్యోగాలకు ఎత్తు కూడా చాలా అసవరం. ఎత్తుగా ఉన్న వారిలో ఆత్మవిశ్వాసం కూడా అధికంగా ఉంటుందని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. పిల్లలకు జన్యుపరంగానే ఎత్తు కూడా సంక్రమిస్తుంది. కానీ చిన్నప్పటి జీవనశైలి, ఆహారం వంటివి కూడా ఎత్తును కొంచెం పెంచేందుకు సహకరిస్తాయి. ఎత్తు పెరిగేందుకు సాల్మన్ చేప మంచి ఎంపిక. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల్లో ఎత్తు పెరిగేందుకు చాలా సహకరిస్తాయి. పాలలాగే గుడ్లు కూడా సంపూర్ణ ఆహారం. ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్లు, కాల్షియం ఇలా పిల్లల ఎత్తు పెరిగేందుకు అవసరమైనవన్నీ ఇందులో లభిస్తాయి. ఎర్రని చిలగడ దుంపలు జీర్ణశయంలో మంచి బ్యాక్టిరియా సంఖ్యను పెంచుతాయి. పెరిగే పిల్లలకు ఇది సూపర్ ఫుడ్. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ బెర్రీలు వంటి వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది కణాల పెరుగుదలకు, కణజాలాల మరమ్మత్తుకు చాలా ముఖ్యమైనది. టీనేజీ వయసు పిల్లల్లో పెరుగుదలను ప్రోత్సహించడంలో ఆకుకూరలు ముందుంటాయి. పెరుగుతున్న పిల్లల పోషకాహార అవసరాలను తీర్చడానికి వారానికి రెండు సార్లు ఆకుకూరలను తినడం అవసరం.