మీరు అడ్మిన్ గా ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన మెసేజ్ లు పెట్టినట్లయితే మీరు జైలుకు పోయే అవకాశం ఉంది.



వాట్సాప్‌లో పోర్న్ క్లిప్స్ షేర్ చేయకూడదు.



వాట్సాప్ లో మార్ఫ్ డ్ ఫొటోలు, వీడియోలను షేర్ చేయడం కూడా శిక్షార్హమైన నేరం.



మరొకరి పేరుతో వాట్సాప్ ఖాతాను ఓపెన్ చేయడం, వారి లాగా చాట్ చేయడం కూడా నేరమే.



ఎదుటివారి మతానికి, ప్రాంతానికి, నమ్మకాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా మెసేజ్ లు పెడితే మీరు అరెస్టు అయ్యే అవకాశం ఉంది.



వాట్సాప్‌లో నకిలీ వార్తలను షేర్ చేసినా మీ మీద ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.



నిషేధిత వస్తువుల అమ్మకాలను వాట్సాప్ ద్వారా అమ్మడం చట్టరీత్యా నేరం.



వాట్సాప్ ద్వారా హిడెన్ కెమెరా వీడియోలు పంపడం, వేరే వారికి తెలియకుండా వారి వీడియోలు రికార్డ్ చేసి పంపడం కూడా నేరమే.



వాట్సాప్ తన మాతృసంస్థ అయిన ఫేస్ బుక్ (ఇప్పుడ మెటా) ద్వారా ప్రతి వినియోగదారుడి వ్యక్తిగత సమాచారాన్ని పొందగలదు. అనంతరం దాన్ని న్యాయ సంబంధిత సంస్థలకు అవసరమైనప్పుడు అందిస్తూ ఉంటుంది.



వాట్సాప్‌లో మెసేజ్ లు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ కాబట్టి పోలీసులు నేరస్తుడి పేరు, మొబైల్ నంబర్, లొకేషన్, మొబైల్ నెట్ వర్క్, మొబైల్ హ్యాండ్ సెట్ టైప్ వంటి వాటిని పొందవచ్చు. అంతేకాకుండా మీరు ఎవరితో చాట్ చేస్తారో కూడా పోలీసులు తెలుసుకోగలరు.