ఆయిల్ మసాజ్‌‌తో రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం

మూడో వేవ్ రూపంలో ముంచుకొచ్చిన ఒమిక్రాన్ చాలా త్వరగా పాకిపోతూ ప్రజల్లో భయాందోళనలు పెంచేస్తోంది.

ఈ సందర్భంలో అన్ని రకాలుగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం.

ఆయిల్ మసాజ్ కూడా రోగనరోధక శక్తిని పెంచుకునేందుకు సహాయపడుతుంది.

ఆయిల్ మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇవి పోషకాలను శరీరం మొత్తానికి చేరేలా చేస్తాయి.

శరీరంలోని నొప్పి, ఒత్తిడిని తగ్గించేందుకు కూడా మసాజ్ ఉపయోగపడుతుంది. దీని వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

ఏమీ తినకుండా ఖాళీ పొట్టతో మసాజ్ చేయించుకోకూడదు. ఎందుకంటే ఈ ప్రక్రియ జీర్ణ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.

యూకలిప్టస్, లవంగం, లావెండర్, టీట్రీ నూనెలను మసాజ్ చేయడానికి ఉపయోగించాలి.

ఉదయాన్నే మసాజ్ చేసుకుంటే మంచిది. ఆ సమయంలో అందరూ శక్తిమంతంగా, తాజాగా ఉంటారు.

ఉదయం వీలు కాకపోతే మధ్యాహ్నం భోజనం పూర్తయిన ఓ గంట తరువాత మసాజ్‌కు వెళ్లినా మంచిదే.