టాటా మోటార్స్ జనవరి నుంచి మనదేశంలో కార్ల ధరను పెంచిన సంగతి తెలిసిందే.



దీంతో టాటా పంచ్ ధర మనదేశంలో రూ.16,000 వరకు పెరిగింది.



టాటా పంచ్ ధర రూ.5.49 లక్షల నుంచి రూ.5.65 లక్షలకు పెరిగింది.



ఇప్పుడు ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ ధరను కంపెనీ తగ్గించింది.



ఈ వేరియంట్ ధరను రూ.8.49 లక్షల నుంచి రూ.8.4 లక్షలకు తగ్గించారు.



టాటా పంచ్ క్రియేటివ్ ఆటోమేటిక్ ధరను రూ.9.09 లక్షల నుంచి రూ.8.99 లక్షలకు తగ్గించారు.



టాటా పంచ్ క్రియేటివ్ ఐఆర్ఏ వేరియంట్ ధరను రూ.8.79 లక్షల నుంచి రూ.8.7 లక్షలకు తగ్గించారు.



టాటా పంచ్ క్రియేటివ్ ఐఆర్ఏ ఏఎంటీ వేరియంట్ ధర రూ.9.39 లక్షల నుంచి రూ.9.29 లక్షలకు తగ్గింది. అయితే ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే.



టాటా పంచ్ టాప్ ఎండ్ వేరియంట్ల ధర రూ.10 వేల వరకు తగ్గాయని చెప్పవచ్చు.



టాటా పంచ్ క్రియేటివ్ వేరియంట్లో ప్రీమియం ఫీచర్లను కంపెనీ అందించింది.