పుష్యమి నుంచి స్వాతి వరకూ ఏ ఏ నక్షత్రాలు, ఏ పాదాలు మంచివి...
అశ్విని నుంచి రేవతి వరకూ మొత్తం 27 నక్షత్రాలు, ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయి. కొన్ని నక్షత్రాల్లో నాలుగు పాదాలకి దోషం ఉంటే..మరికొన్ని నక్షత్రాల్లో ఒక్కో పాదానికి ఒక్కో ఫలితం ఉంటుంది.
పుష్యమి నక్షత్రం కర్కాటక లగ్నం పగటి సమయమున మగపిల్లాడు పుడితే తండ్రికి, రాత్రి వేళ ఆడపిల్ల పుడితే తల్లికి గండం ఉంటుందని చెబుతారు. పుష్యమి నక్షత్రం రెండు, మూడు పాదాల్లో జన్మిస్తే తల్లిదండ్రులకు దోషం ఉంటుందని..ఒకటి, నాలుగు పాదాల్లో పుడితే ఎలాంటి దోషం లేదంటారు.
ఆశ్లేష నక్షత్రం 1 వ పాదంలో పుట్టినవారికి ఎలాంటి దోషం లేదు. 2 వ పాదం శిశువుకు 3 వ పాదం తల్లికి 4 వ పాదం తండ్రికి దోషం . నాలుగవ పాదము న జన్మించిన వారికి శాంతి తప్పనిసరి.
మఖ నక్షత్ర 1 వ పాదంలో పుడితే శిశువుకి దోషం, రెండో పాదంలో పుడితే మంచిదే. మూడో పాదం తల్లిదండ్రులకు దోషం ఉంటుంది. 4 పాదములలో జన్మించిన దోషము లేదు.
పుబ్బ నక్షత్రముం1 2 3 4..ఏ పాదంలో జన్మించినా ఎలాంటి దోషమూ ఉండదు. అంటే శాంతి అవసరం లేదన్నమాట.
ఉత్తర నక్షత్రం 1, 4 పాదాల్లో పుడితే తల్లి, తండ్రులకు దోషం కలుగుతుంది. మిగతా 2 3 పాదములలో పుట్టిన వారికి దోషం లేదు. నాలుగో పాదంలో పుట్టిన వారికి స్వల్ప దోషం ఉంటుంది.
హస్తా నక్షత్రం 3 వ పాదంలో పుట్టిన మగపిల్లాడి వల్ల తండ్రికి, ఆడపిల్ల వల్ల తల్లికి దోషం. మిగతా 1 2 4 పాదాల్లో జన్మించిన వారికి దోషం లేదు.
చిత్త నక్షత్రం 1 వ పాదం, 2 వ పాదం తల్లిదండ్రులకు దోషం ఉంటుంది. మూడు, నాలుగు పాదాలు స్వల్పదోషం ఉంటుంది.
స్వాతి నక్షత్రం 1 2 3 4 పాదాల్లో ఏ పాదంలో జన్మించినా ఎలాంటి దోషమూ లేదు..
నక్షత్రంతో సంబంధం లేకుండా పేగులు మెడలో వేసుకుని పుట్టినా, కాళ్లు మొదట బయటకు వస్తూ పుట్టినా, గ్రహణ సమయంలో జన్మించినా, తండ్రిదండ్రులు, తోబుట్టువల జన్మ నక్షత్రంలో పుట్టినా తప్పక శాంతి చేయించాలి.
శాంతిరోజు ఏం చేయాలనేది నక్షత్రం, పాద దోషంపై ఆధారపడి ఉంటుంది. మీరు విశ్వసించే పండితుల దగ్గరకు వెళ్లి పూర్తివివరాలు తెలుసుకుని శాంతి చేయించాలి...