బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్‌లు సరోగసి పద్ధతిలో తల్లిదండ్రులయ్యారు. వారికంటే ముందు మరికొందరు సెలబ్రిటీలు కూడా సరోగసి విధానంలో సంతానాన్ని పొందారు. వారెవరో చూసేయండి మరి.



ఏక్తా కపూర్: జనవరి 2019లో సరోగసి విధానంలో తల్లైంది. ఏక్తా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమె స్టేటస్ ఇంకా సింగిలే.



తుషార్ కపూర్: తన అక్క ఏక్తా కంటే ముందే తుషార్ 2016లో సరోగసి విధానంలో తండ్రయ్యాడు. ఇతడు కూడా సింగిలే.



కరణ్ జోహార్: ఈయన కూడా పెళ్లి చేసుకోలేదు. కానీ, 2017లో సరోగసి విధానంలో కవలలకు తండ్రయ్యారు.



సన్నీ లియోన్: 2018లో సన్నీ లియోనే సరోగసి విధానంలో కవలలకు తల్లైంది.



షారుక్ ఖాన్: 2013లో షారుక్ దంపతులు అబ్‌రామ్‌కు సరోగసి విధానంలో తల్లిదండ్రులయ్యారు.



లిసా రే: ఈమె కూడా 2018లో సరోగసి విధానంలో కవల పిల్లలకు తల్లైంది. ఈమె 2012లో జాసన్ డెహ్నీని పెళ్లాడింది.



శిల్పాశెట్టి: పెళ్లి తర్వాత ఈ నటి 2020లో సరోగసి విధానంలో ఆడ బిడ్డకు తల్లైంది. ఈమె 2009లో రాజ్ కుంద్రాను పెళ్లిచేసుకుంది.



ప్రీతి జింటా: నవంబరు 2021లో ట్విన్స్‌ జయ్, గయ్‌లకు సరోగసి ద్వారా తల్లైంది.



మంచు లక్ష్మి: 38 ఏళ్ల వయస్సులో 2014లో లక్ష్మీ సరోగసి విధానంలో నిర్వణకు తల్లైంది. లక్ష్మీకి 2006లో శ్రీనివాసన్‌తో పెళ్లయ్యింది.


Images Credit: Instagram
Video Credit: Pixels