ఇవి తింటే రోగనిరోధక శక్తి తగ్గిపోవడం ఖాయం



కొత్త వేరియంట్లు విరుచుకుపడుతున్నవేళ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం.



రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలే కాదు, తగ్గించే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిని తినవద్దని కూడా సూచిస్తున్నారు ఆహారనిపుణులు.



వీటిని తినడం వల్ల అప్పటికే ఒంట్లో ఉన్న ఇమ్యూనిటీ ఇంకా తగ్గిపోతుంది.



దాహాన్ని తీర్చే సోడా రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.



ఆయిల్‌లో డీప్‌గా వేయించిన ఆహారాలు అంటే ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ పకోడాలాంటి వాటిలో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి.



రోజూ తాగే వారిలో మాత్రం ఆల్కహాల్ ప్రభావం మామూలుగా పడదు. ఇది రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఇది నిద్రకు కూడా భంగం కలిగిస్తుంది.



మైదా, పంచదార, నూనె ఉపయోగించి చేసే బేకరీ ఉత్పత్తుల వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది.



పంచదారతో చేసిన ఆహారాన్ని తినకపోవడం చాలా మంచిది. వీటిని అధికంగా తినడం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది.