ఒక్క అడుగు గ్యాప్ లో సముద్ర హోరు మాయమవుతుంది..అదే జగన్నాథుడి ప్రత్యేకత
పూరీ జగన్నాథ్ ఆలయమే ఓ మిస్టరీ. 65 అడుగుల ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం, అక్కడ ఉండే స్తంభాలు, గోడలు...ఆలయంలో అణువణువూ ప్రత్యేకమే...
జగన్నాథుడి ఆలయ సింహ ద్వారం నుంచి లోపలికి మొదటి అడుగు వేసిన వెంటనే సముద్రపు తరంగాల శబ్దం వినబడదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆలయం నుంచి ఒక అడుగు బయటకు వేసిన వెంటనే సముద్రం అలల హోరు వినబడుతుంది.
చాలా దేవాలయాల శిఖరంపై పక్షులు కూర్చుంటాయి, ఎగురుతూ ఉంటాయి...కానీ జగన్నాథ్ ఆలయం మీదుగా ఏ పక్షి కూడా ఎగరదు.
ఆలయంపైనున్న జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది
జగన్నాథుడి ఆలయం ప్రధాన శిఖరం నీడ ఏ సమయంలో కూడా పడదు
ఆలయం 45 అంతస్తుల శిఖరంపై ఉన్న జెండాను ప్రతిరోజూ మారుస్తారు.. ఒక్కరోజు జెండా మార్చకపోతే ఈ ఆలయం 18 ఏళ్లు మూసివేయాల్సి వస్తుందట.
ఆలయం పైభాగంలో ఉన్న సుదర్శన్ చక్రం...ఏ దిశ నుంచి చూసినా అది ఎదురుగా ఉన్నట్టే ఉంటుంది
వంటగదిలో 7 మట్టి కుండలు ఒకదానికొకటి పైన ఉంచి ప్రసాదం ఉడికించాలి, ఇది ఒక చెక్క నిప్పుతో వండుతారు, ఈ సమయంలో పైన ఉంచిన కుండ వంటకం మొదట వండుతారు
జగన్నాథుడికి నిత్యం చేసే ప్రసాదం భక్తులకు ఎప్పుడూ తగ్గదు, కాని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆలయ తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా అయిపోతుంది.