అనసూయ, రష్మీ, శ్రీముఖి, విష్ణుప్రియ... బుల్లితెరపై వీళ్లది తిరుగులేని ఇమేజ్. వీరు వెండితెరపై సెగలు రేపే పాటలు చేశారు. ఆ పాటలేవో చూడండి. రష్మీ గౌతమ్ సినిమా అంటే ముందు గుర్తొచ్చేది 'గుంటూరు టాకీస్'. సినిమాతో పాటు అందులోని 'నీ సొంతం' సాంగ్ చాలా పాపులర్. అనసూయ సాంగ్స్ విషయానికి వస్తే... 'చావు కబురు చల్లగా'లో చేసిన 'పైన పటారం... లోన లొటారం' మిగతా వాటి కంటే ముందు ఉంటుంది. అనసూయ మీద సాయి తేజ్ 'విన్నర్'లో 'సూయ... సూయ... అనసూయ' అంటూ ఓ పాట రాశారు. దానిని సుమ పాడటం విశేషం. రష్మీ గౌతమ్ కథానాయికగా నటించిన 'అంతకు మించి'లో పాటలు హిట్ కాదు. కానీ, అందులో ఆమె వేసుకున్న డ్రస్, స్టెప్స్ వల్ల పాపులర్ అయ్యాయి. శ్రీముఖి 'ఓ వుమనియా' అని ఓ షో చేశారు. దాని కోసం మహిళల మీద ఓ పాట రాశారు. అది పాపులర్ అయ్యింది. సినిమా సాంగ్స్ స్థాయిలో ఉంటుంది. యాంకర్ విష్ణుప్రియ 'చెక్ మేట్' అని ఓ సినిమా చేశారు. అందులోని ఓ పాటలో స్విమ్ సూట్ ధరించారు. ఆమె అందాల కోసం పాటను చూసినవాళ్లు ఉన్నారు. 'సోగ్గాడే చిన్ని నాయనా' టైటిల్ సాంగులో కూడా అనసూయ తళుక్కున మెరిశారు. శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'క్రీజీ అంకుల్స్'. ఆ సినిమా టైటిల్ సాంగులో ఆమె మోడ్రన్ మహారాణిలా సందడి చేశారు.