దాల్చినచెక్క వల్ల గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయా? దాల్చిన చెక్కను బిర్యానీలకు మాత్రమే పరిమితం చేస్తున్నాం. కానీ దీనిలో మనకు తెలియని ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. వీటిలో ఉండే సుగుణాలు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుతాయని అధ్యయనాలు బయటపెట్టాయి. ముఖ్యంగా మహిళలు వీటిని తింటే గర్భవతి అయ్యే అవకాశాలు రెట్టింపు అవుతాయిట. మగవారు ఆహారంలో దీన్ని భాగం చేసుకోవడం వల్ల వారిలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. వీర్యకణాల కదలికలు కూడా చురుగ్గా ఉంటాయి. మహిళలు వీటిని తినడం వల్ల నెలసరులు క్రమపద్ధతిలో వస్తాయి. గర్భం ధరించాలంటే రుతుక్రమం సరిగా ఉండాలన్న విషయం తెలిసిందే. ఉదయానే దాల్చిన చెక్క టీ లేదా, దాల్చిన చెక్క నీళ్లను తాగాలి. దాల్చిన చెక్కను పొడిలా చేసుకుని చిటికెడు కూరల్లో లేదా, సలాడ్లపై, సూప్‌లలో కలుపుకుని తినొచ్చు. నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, దాల్చిన చెక్కపొడి, తేనె కలుపుకుని తాగితే చాలా మంచిది.