హిమాలయన్ సాల్ట్ అంటే ఏమిటి?



గులాబీ రంగు రాతి ఉప్పులా ఉండే ఈ ఉప్పును హిమాలయాల్లోని రాతి స్పటికాలతో ఈ ఉప్పును తయారు చేస్తారు.



హిమాలయన్ సాల్ట్‌ను పింక్ సాల్ట్ అని కూడా పిలుస్తారు.



సాధారణ ఉప్పులా కాకుండా.. ఇందులో సహజంగానే అయోడిన్ ఉంటుంది.



ఇందులో ఉండే ఐరన్ ఆక్సైడ్ వల్ల ఈ ఉప్పు పింక్ కలర్‌లో ఉంటుంది. అయితే, ఇది చాలా అరుదుగా లభించే ఉప్పు.



దీనిలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, జింక్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఉప్పును వంటకాల్లో వినియోగిస్తున్నారు.



శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను సమతుల్యంగా ఉంచేందుకు ఈ ఉప్పు అవసరమవుతుంది.



తామర వంటి వివిధ చర్మ పరిస్థితుల నుంచి ఈ ఉప్పు ఉపశమనం కలిగిస్తుంది.



ఈ ఉప్పును కూడా మితంగానే తినాలి. అధికంగా తింటే ఎన్నో సమస్యలు వస్తాయి.