మాంసాహారంతో పోలిస్తే శాకాహారంతో మంచి పోషణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శాకాహారంతో కలిగే లాభాలు తెలుసుకుందాం. మాంసాహారంతో పోల్చినపుడు శాకాహారంలో గుండె జబ్బుల ప్రమాదం తక్కువ. శాకాహారంలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, బీపిలను అదుపులో ఉంచుతాయి. శాకాహారం బరువు అదుపులో పెట్టేందుకు దోహదం చేస్తుంది. సంతృప్త కొవ్వులు, క్యాలరీలు తక్కువ. త్వరగా కడుపు నిండుతుంది. శాకాహారం తీసుకునే వారిలో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం కూడా తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. గింజలు, పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తాయి. పెద్దపేగు, రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సరల్ శాకాహారంతో నివారించవచ్చు. శాకాహారంతో జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. జీర్ణవ్యవస్థలో ఉపకరించే బ్యాక్టీరియా పెరుగుతుంది. శాకాహారంతో కిడ్నీ పనితీరు కూడా మెరుగవుతుంది. శాకాహారంతో కిడ్నీమీద ఆమ్ల ప్రభావం తగ్గుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడవు. శాకాహారుల్లో జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని, దీర్ఘాయుష్షుకు కారణం అవుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. All Images Credit: Pexels