ఆవనూనెతో బోలెడంత ఆరోగ్యం ఆవ నూనెను ఇంట్లో చలికాలంలో కచ్చితంగా ఉండేలా చూసుకోండి. ప్రతిరోజు ఆవనూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కొన్ని తీవ్రమైన వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆవనూనెతో వండిన వంటకాలు తినడం వల్ల ఎంత ఉపయోగం ఉందో దీన్ని చర్మానికి రాసుకోవడం వల్ల కూడా అంతే ఉపయోగం కలుగుతుంది. ఛాతీపై సున్నితంగా మర్దన చేసుకోవడం వల్ల అక్కడ పేరుకుపోయిన కఫం బయటకు వచ్చేస్తుంది. ముక్కు దిబ్బడ కట్టినట్లయితే వేడి నీటిలో ఆవాల నూనె వేసి ఆవిరి పట్టితే మంచి ఉపసమనం కలుగుతుంది. ఆర్ధరైటిస్‌తో బాధపడేవారు ఆవనూనెను గోరువెచ్చగా చేసి మర్దన చేసుకోవాలి. క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడంలో కూడా ఇది ముందుంటుంది. ఎన్నో రకాల క్యాన్సర్లను తగ్గించే శక్తి దీనికి ఉంది. ఈ నూనెను చర్మానికి మసాజ్ చేయడంతో పాటు రోజుకి కనీసం రెండు స్పూన్ల నూనెను ఆహారంలో భాగం చేసుకుని తింటే ఎంతో మంచిది.