బీన్స్ తరచుగా తీసుకుంటే వయసు ప్రభావం నుంచి తప్పించుకుని అందంగా ఆరోగ్యంగా ఉండచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ కలిగిన బ్లాక్ బీన్స్, చిక్ పీస్, కిడ్నీ బీన్స్ వృద్ధాప్యాన్ని వాయిదా వేస్తాయి.

బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి చర్మాన్ని కాపాడుతాయి.

వీటిలోని బి కాంప్లెక్స్ విటమిన్లు చర్మం మీద సన్నని గీతలు, ముడతలను నివారిస్తాయి.

బీన్స్ లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి మినరల్స్ ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

బీన్స్ లో ఉండే ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. అందువల్ల గుండె యవ్వనంగా ఉంటుంది.

పైబర్ కలిగి బీన్స్ తరచుగా తీసుకుంటే వయసుతో వచ్చే మలబద్దక సమస్య నివారించబడుతుంది.

వయసు పెరిగే కొద్దీ శరీర బరువు అదుపులో పెట్టుకోవడం అవసరం. ప్రొటీన్, ఫైబర్ కలిగిన బీన్స్ వల్ల బరువు అదుపులో పెట్టుకోవచ్చు.

వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు నెమ్మదిస్తుంది. బీన్స్ లో ఉండే ఫోలేట్ మెదడు ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

All Images Credit: Pexels