చలికాలంలో గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలతో ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు.

వాతావరణం చల్లగా ఉండడం వల్ల రక్తనాళాలు కుంచించుకు పొయ్యే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా బీపి పెరగుతుంది.

బీపి పెరగడం గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం కావచ్చు.

పెరీఫెరల్ రక్తనాళాల పనితీరును తరచుగా పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఈ రక్తనాళాల్లో సమస్యలు గుండెకు మంచిదికాదు.

వీలైనంత వరకు చల్లని వాతావరణంలో వర్కవుట్ కూడా ఇన్ డోర్ లో చేసుకోవడం మంచిది. గుండె ఆరోగ్యం కోసం వర్కవుట్ తప్పనిసరి.

తాజా కూరగాయలు, పండ్లు, గింజలు, ఇతర ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి.

ఆల్కహాల్, పొగతాగడం, అదనపు చక్కెరలు తీసుకోవడం, ఉప్పు తీసుకోవడం వంటివన్నీ తగ్గించుకోవాలి.

తప్పనిసరిగా తగినన్ని నీళ్లు తాగాలి. శరీరం హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల బీపి అదుపులో ఉంటుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం బాగుంటుంది.

ఒత్తిడి తగ్గించుకోవడం కోసం ధ్యానం, యోగా వంటివి సాధన చెయ్యడం మంచిది.

దీర్ఘకాలిక సమస్యలకు వాడే మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి.



All Images Credit: Pexels and Unsplash