ఆల్కాహాల్ పరిమితులకు మించి తీసుకుంటే అది విషంగా పరిణమిస్తుంది. మీ శరీరం ఇక దాన్ని జీర్ణించుకోలేదు.

పరిమితులకు మించిన ఆల్కాహాల్ రక్తంలో విషంగా మారుతుంది. లివర్ మీద చెడు ప్రభావం పడుతుంది.

శ్వాసతీరులో మార్పులు, స్పందించే తీరులో తేడా, పాలిపోయిన చర్మం, శరీర ఉష్ణోగ్రతలు తగ్గడం, వాంతుల వంటి లక్షణాలు ఉంటాయి.

మొదట్లో లివర్ సెల్స్ లో అదనంగా ఫ్యాట్ చేరుతుంది. ఫలితంగా ఫ్యాటి లివర్ గా మారుతుంది.

ఆల్కహాల్ వినియోగం అలాగే కొనసాగిస్తే ఆల్కహాలిక్ హెపటైటిస్ గా పరిణమిస్తుంది.

ఆల్కహాలిక్ హెపటైటిస్ తర్వాత కాలంలో లివర్ సిర్రోసిస్ కు కారణం కావచ్చు.

తర్వాత స్థాయిలో లివర్ కోలుకోలేనంత పాడైపోయి పనితీరు మందగిస్తుంది. ఇది క్రమంగా లివర్ ఫెయిల్యూర్ కు కారణం కావచ్చు.

ఆల్కహాల్ పాయిజనింగ్ వల్ల లివర్ ప్రొటీన్ల ఉత్పత్తి సామర్థ్యం మందగిస్తుంది.

ఇది క్రమంగా పోషకాహార లోపం, బ్లీడింగ్ డిజార్డర్లకు కారణం అవుతుంది.

లివర్ శరీరాన్ని విషపూరితం కాకుండా కాపాడుతుంది. ఆ పనిలో కనుక ఆటంకం కలిగితే శరీరం విషపూరితమవుతుంది.
Representational image: Pexels