అదేంటి ల్యాప్ టాప్ బ్యాగ్ మోయడం వల్ల వచ్చే నష్టం ఏముంటుందని అనుకుంటారు.



కానీ దాని బరువు మోయడం అనేది అంత ఈజీ కాదు.
అందులో ల్యాప్ టాప్ 2 కేజీలు, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ఇతర వస్తువులు పెట్టేసుకుంటారు.


అలా దాని బరువు 3 కేజీల వరకు ఉంటుంది. దాన్ని వీపుకి తగిలించుకోవడం వల్ల
భుజాలు, మెడ మీద దాని ప్రభావం పడుతుంది.


దీర్ఘకాలం పాటు మోయడం వల్ల వెన్నెముక మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది.



కొంతమంది ఒకవైపు మాత్రమే తగిలించుకోవడం వల్ల ఒకవైపు మాత్రమే బరువు పడుతుంది.
దాని వల్ల అటువైపు కండరాలు బలహీనమవుతాయి.


బ్యాగ్ బరువు ఒత్తిడి కీళ్ల మీద పడుతుంది. ప్రతిరోజూ అంత బరువు మోయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి.



అలా జరగకూడదంటే బ్యాగ్ ని ఒకవైపు కాకుండా రెండు వైపులా తగిలించుకోవడం మంచిది.



అప్పుడు బ్యాగ్ బరువు సమానంగా శరీరమంతా పడుతుంది. వీలైనంత వరకు అనవసరమైన వస్తువులు
తీసేయడమే బెటర్.


ప్యాడెడ్ పట్టీలు, బ్యాక్ సపోర్ట్ ఉన్న బ్యాగ్‌లను ఎంచుకోవడం మంచిది



బరువైన వస్తువులు వీపుకి దగ్గరగా తేలికగా ఉన్నవి బ్యాగ్ పైన పెట్టుకోవడం మంచిది.