చూయింగ్ గమ్ మింగేస్తే ఏమవుతుంది?



స్టైలిష్ గా చూయింగ్ గమ్ నములుతూ పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు.



కొంతవరకు చూయింగ్ గమ్ నమలడం మంచి వ్యాయామమనే చెప్పాలి. చూయింగ్ గమ్ అనుకోకుండా మింగేసే వాళ్ళు ఉన్నారు.



చూయింగ్ గమ్ మింగేస్తే పేగులకు చుట్టుకుపోయి ఇబ్బంది పెడుతుందని ఎంతో మంది నమ్మకం.



నిజానికి చూయింగ్ గమ్ మింగేసినా అది జీర్ణం కాదు. ఇలా జీర్ణంకానీ గమ్ పేగుల ద్వారా బయటికి వచ్చేస్తుంది.



చూయింగ్ గమ్ బయటికి రావడానికి కనీసం 12 నుంచి 48 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.



చూయింగ్ గమ్ మింగితే నీళ్లు అధికంగా తాగండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.



ఇలా చేయడం వల్ల చూయింగ్ గమ్ బయటికి వేగంగా మలవిసర్జన ద్వారా వచ్చేసే అవకాశం ఉంది.



చాలా అరుదైన పరిస్థితుల్లో మాత్రమే చూయింగ్ గమ్ వల్ల ఇబ్బందులు వస్తాయి.