రోజుకు రెండు స్ట్రాబెర్రీలు తింటే ఏమవుతుందంటే...



స్ట్రాబెర్రీలు సూపర్ మార్కెట్లలో అన్ని సీజన్లోనూ లభిస్తాయి. ముఖ్యంగా పిల్లలు వీటిని తినేందుకు ఇష్టపడతారు.



రోజుకు రెండు స్ట్రాబెర్రీ పండ్లు తింటే చాలు, శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు జరుగుతాయి.



ఇతర పండ్లతో పోలిస్తే దీనిలో కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తిన్నాక రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరుగుతాయన్న భయం అవసరం లేదు.



మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ కె... ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి.



అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు స్ట్రాబెర్రీలను రోజూ తినడం అలవాటు చేసుకోవాలి.



వీటిని రోజూ తినడం వల్ల గుండె సమస్యలు, జీవక్రియ సమస్యలు, ఏకాగ్రత లోపాలు వంటివి రాకుండా ఉంటాయి.



శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అయిన LDL‌ను తగ్గించడం ద్వారా హృదయ సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది స్ట్రాబెర్రీ.



స్ట్రాబెర్రీలు అధికంగా తినడం వల్ల అల్జీమర్స్, మతిమరుపు వంటివి రాకుండా ఉంటాయి.