రోజుకు గంటపాటూ సైకిల్ తొక్కండి చాలు... రోజూ సైక్లింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వయసు మీరినా ఆ ఛాయలు మీలో కనిపించవు. సైకిల్ రోజూ తొక్కడం వల్ల శరీరం బ్యాలెన్స్ గా ఉంటుంది. కొవ్వు కరిగిపోతుంది. సైకిల్ తొక్కడం వల్ల శరీరం త్వరగా బరువు తగ్గుతుంది. రోజుకు కనీసం నాలుగైదు కిలోమీటర్లు సైకిల్ తొక్కితే శరీరమంతా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి సైక్లింగ్ చేయడం వల్ల తగ్గుతాయి. రోగనిరోధక శక్తి పెరగాలంటే రోజూ గంట పాటూ సైకిల్ తొక్కాలి. డిప్రెషన్ బారిన పడకుండా ఉండాలంటే రోజూ సైకిల్ తొక్కాలి. శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందాలంటే సైకిల్ తొక్కడం మంచి వ్యాయామం.