ఈ సందర్భాల్లో నీళ్లు తాగకూడదు



మన శరీరానికి తగినంత ఆహారం, నీరు అందితేనే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాము.



నిజానికి ఆహారం కన్నా నీరు చాలా ముఖ్యం. నీరు సరిగా అందకపోతే జీవక్రియల నిర్వహణలో ఎన్నో మార్పులు వస్తాయి.



కొన్ని సందర్భాల్లో మాత్రం నీటిని దూరం పెట్టాలి. లేకుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.



నిద్రించే ముందు ఎక్కువ నీరు తాగడం మంచిది కాదు. రాత్రి సమయంలో ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుంది.



రాత్రి మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది. ఈ సమయంలో నీరు ఎక్కువగా ఉంటే మూత్రపిండాలు రాత్రిపూట సరిగా పనిచేయలేవు.



వ్యాయామం చేసేటప్పుడు నీరు తాగితే శరీర ఉష్ణోగ్రతలో హఠాత్తుగా మార్పులు వచ్చేస్తాయి. ఇవి ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది.



ఆహారం తీసుకునే సమయంలో కూడా చాలామంది ఎక్కువ నీళ్లు తాగేస్తూ ఉంటారు. ఇలా నీళ్లు తాగడం వల్ల శరీరానికి సరిపడా ఆహారం తీసుకోలేరు.



ఆహారం తినడానికి అరగంట ముందు, ఆహారం తిన్న అరగంట తర్వాత... నీళ్లు తాగకపోవడమే మంచిది.