డిస్పోజబుల్ కప్పుల వల్ల క్యాన్సర్ ముప్పు



ఆధునిక కాలంలో డిస్పోజబుల్ కప్పుల వినియోగం పెరిగింది. వాటిని ఒకసారి వాడి పడేయవచ్చు.



దీర్ఘ కాలంగా ఇలాంటి డిస్పోజబుల్ గ్లాసులు వాడే వారిలో క్యాన్సర్ ముప్పు అధికంగా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.



తక్కువ ధరకే డిస్పోజబుల్ గ్లాసులు లభిస్తున్నాయి. వీటిని ప్లాస్టిక్, కాగితం వంటి వాటితో తయారు చేస్తారు.



వీటి తయారీలో అనేక రసాయనాలను కూడా కలుపుతారు. అందుకే వీటిని దీర్ఘకాలంగా వాడటం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.



డిస్పోజబుల్ గ్లాసుల్లో బిస్ ఫినాల్, బిపిఏ వంటి రసాయనాలు ఉంటాయి. వీటిల్లో వేడి పానీయాలు వేసినప్పుడు ఈ రసాయనాలు వాటిలో కరిగిపోయే అవకాశం ఉంది.



ఈ రసాయనాలు టీ, కాఫీల ద్వారా పొట్టలోకి ప్రవేశించి అక్కడ అనేక మార్పులకు కారణం అవుతాయి.



దీర్ఘకాలంగా ఇలా తాగే వారిలో క్యాన్సర్ కణితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది.



కాబట్టి డిస్పోజబుల్ గ్లాసులు, కప్పుల్లో తాగడాన్ని తగ్గించుకోవాలి.