నగ్నంగా పడుకుంటే ఇన్ని లాభాలా?



రాత్రిపూట నగ్నంగా నిద్రించడం వల్ల ఆరోగ్యాన్ని పెంచుకోవడంతో పాటు బరువు కూడా సులువుగా తగ్గవచ్చని చెబుతున్నాయి ఎన్నో అధ్యయనాలు.



మన శరీరం ఉష్ణోగ్రత సాయంత్రమయ్యేసరికి తగ్గిపోతూ ఉంటుంది. మీ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం అనేది రాత్రికి మంచిగా నిద్ర పట్టడానికి కీలకమైన అంశం.



మందపాటి దుస్తులు వేసుకోవడం వల్ల శరీరం సహజంగా చల్లబడదు.



రాత్రి నిద్రపోయే ముందు నగ్నంగా నిద్రించడం వల్ల చక్కగా నిద్ర పడుతుందని చెబుతున్నారు పరిశోధనకర్తలు.



పూర్తిగా నగ్నంగా ఉండలేని వారు అతి తక్కువ దుస్తులు ధరించి నిద్రపోవడం మంచిది. అంటే శరీరంలో 80% నగ్నంగా ఉండటమే మంచిది.



ఇది రాత్రిపూట మీ చర్మం ఊపిరి పీల్చుకోవడానికి సహాయపడుతుంది.



వేసవికాలంలో రాత్రి నిద్ర పోయేటప్పుడు లోదుస్తులు ధరించకపోవడమే మంచిది. ఇవి చెమట, తేమను పట్టి ఉంచుతాయి.



దీనివల్ల జననేంద్రియాల ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఏర్పడవచ్చు.