పెరుగు - పంచదార కలిపి తింటే ఏమవుతుందంటే... పెరుగులో పంచదార కలుపుకొని తింటే టేస్టీగా ఉంటుంది, అలాగే అది అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుందని అంటారు. దీన్ని హిందీలో ‘దహీ శక్కర్’ అంటారు. ఈ కాంబినేషన్‌ను రోజూ తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. పెరుగు - పంచదార కలిపి తినడం వల్ల క్యాలరీలు అధికంగా శరీరంలో చేరుతాయి. పెరుగు, పంచదారను కలిపి తినడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం అధికమవుతుంది. పెరుగు మాత్రమే తింటే ఎంతో ఆరోగ్యం. పెరుగులో చక్కెరను కలపడం వల్ల నోటిలోని దంతాలకు సమస్యలు వస్తాయి. దంత క్షయం వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ సమస్య ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారికి పెరుగు, పాలు వంటివి అరగవు. పెరుగులో చక్కెరను కలపడం వల్ల పూర్తిగా అరగకపోవచ్చు. వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. పెరుగును తింటే మంచిదే కానీ, పంచదార కలపడం వల్ల ఆ ఫుడ్ కాంబినేషన్ ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది.