ఐరన్ లోపిస్తే కనిపించే లక్షణాలు ఇవే శరీరానికి ఇనుము అత్యవసరం. అది తగ్గితే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఇనుము లోపిస్తే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మూడు సంకేతాలు కనిపిస్తాయి. శరీరానికి విపరీతమైన అలసటగా అనిపిస్తుంది. బలహీనంగా అనిపిస్తుంది. ఏ పని చేయాలనిపించదు. హృదయ స్పందనలో అసమానతలు వస్తాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది.దీన్నే గుండె దడ అని కూడా అంటారు. శ్వాస ఆడక పోవడం, శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది పడడం వంటి సంకేతాలు కనిపించవచ్చు. ఇనుము పుష్కలంగా సరిగా అందాలంటే చేపలు, చికెన్, మటన్ వంటివి వారానికి రెండు సార్లు తినాలి. డార్క్ చాక్లెట్, బీన్స్, సోయా, పప్పు దినుసులు, పాలకూర, దానిమ్మ, ఓట్స్, కొమ్ము శెనగలు వంటివి అధికంగా తినాలి.