యుజు పండు గురించి తెలుసా?

తూర్పు ఆసియాకు చెందిన సిట్రస్ ఫ్రూట్... యుజు.

రెండు రకాల సిట్రస్ జాతికి చెందిన చెట్ల సంకరణ వల్ల కొత్త చెట్టును పుట్టించారు. ఆ చెట్టుకు కాసిన పండ్లే యుజు.

ఇది చూడటానికి నిమ్మకాయలాగే కనిపిస్తుంది. దీని రుచి ద్రాక్ష పండు, నిమ్మ కలిపి తింటే ఎలా ఉంటుందో... అలా ఉంటుంది.

దీనిలో నిమ్మకాయల కంటే రెండు రెట్లు, నారింజ కంటే ఐదు రెట్లు ఎక్కువ విటమిన్ సి దీనిలో ఉంటుంది.

యుజులో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి, ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.

యుజు పండు చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది. డార్క్ స్పాట్స్‌ను తగ్గిస్తుంది.

యుజు పండులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి.మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది.

దీన్ని సలాడ్‌లలో, డ్రింకులు, డిసర్ట్ తయారీలో కూడా ఉపయోగిస్తారు.