ఇనుప కళాయిలో వండితే ఏమవుతుంది? మహిళలు అధికంగా ఎదుర్కొనే సమస్యల్లో రక్తహీనత ఒకటి. ఒకప్పుడు మహిళలకు రక్తహీనత సమస్య పెద్దగా లేదు. దానికి కారణం ఇనుప కళాయిల్లో వండుకొని తినడమే అంటారు చరిత్రకారులు. అందుకే ఇప్పుడు కూడా ఇనుపకళాయిల్లో వండుకొని తింటే రక్తహీనత సమస్య రాదని చెబుతున్నారు. ఇనుపపాత్రల్లో వండడం వల్ల ఆహారానికి ఐరన్ జత అయ్యేదని దీనివల్ల ఐరన్ లోపం వచ్చేది కాదని అంటారు. ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఐరన్ పాత్రలోనే వండుకొని తింటే అది మరింత పోషకాహారంగా మారుతుందని అంటారు. ఇనుప పాత్రలో వండిన వంటకాలు తింటే తీపి తినాలన్న కోరిక తగ్గుతుంది. ఇనుప పాత్రల్లో వండేటప్పుడు చిన్న మంటపైన వండుకోవాలి. అధికమంటపై వండితే పోషకాలు నశించే అవకాశం ఉంది. వంటలు పూర్తయ్యాక శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తుప్పు పట్టకుండా ఉండాలంటే తడి ఆరిపోయాక కాస్త నూనె రాసి పెడితే మంచిది.