సైక్లింగ్ చేస్తే ఆ రోగాలన్నీ పరార్ రోజూ సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. సైక్లింగ్ అనేది చాలా సులువైన వ్యాయామం. రోజుకో గంట తొక్కినా చాలు, ఎంతో ఆరోగ్యం. లేచిన వెంటనే సైకిల్ తొక్కితే శరీరమంతా రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. సైకిల్ తొక్కడం వల్ల కాళ్లు బలంగా మారుతాయి. రోజూ సైకిల్ తొక్కితే మానసిక సమస్యలు తగ్గుతాయి. ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి వంటివి తగ్గుతాయి. కండరాలు బలంగా మారుతాయి. రోజూ సైకిల్ తొక్కడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. హైబీపీ, ఆర్ధరటిస్, డయాబెటిస్ వంటి రోగాలు ఉన్నవారు కచ్చితంగా సైకిల్ తొక్కాలి.