ఉప్పు పూర్తిగా మానేస్తే మీకే నష్టం



ఉప్పు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకనే ఉప్పును తక్కువగా తీసుకోమని చెబుతారు.



కొంతమంది ఉప్పును పూర్తిగా తినడం మానేస్తారు. అలా మానేయడం ఇంకా ప్రమాదకరం.



ఉప్పును మితంగా తినాల్సిందే. పూర్తిగా మానేస్తే శరీర విధులకు ఆటంకం కలుగుతుంది.



మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలలో ఉప్పు కూడా ఒకటి. ఉప్పు అంటే సోడియం క్లోరైడ్.



ఇది మన శరీరంలో కండరాల కదలికలకు, నాడుల్లో సమాచారం అందించడానికి, హృదయ స్పందనలకు, జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది.



ఉప్పులో 39% సోడియం ఉంటే, 61% క్లోరిన్ ఉంటుంది. మన శరీర బరువులో 0.5% ఉప్పు ఉంటుంది.



ఎప్పుడైతే ఉప్పును తినడం మానేస్తారో శరీరంలో సోడియం శాతం పడిపోతుంది. అప్పుడు కణాలపై ఒత్తిడి పెరిగిపోతుంది.



ద్రవాలు బయటికి పోయి, శరీర సమతుల్యం తప్పుతుంది. దీనివల్ల కణాలలో నీరు నిండిపోతుంది. కణాలలో వాపు వస్తుంది.



దీనివల్ల శరీరం ఉబ్బినట్టు అవుతుంది. కణాలు పగిలి ద్రవాలు బయటకు పోతాయి. అప్పుడు ప్రాణాలకే ప్రమాదం. కనుక ఉప్పును కచ్చితంగా తినాలి.