అమ్మాయిల అందం జుట్టులోనే ఉంటుంది. ఎంత పొడవాటి జడ ఉంటే వాళ్ళ అందం అంతగా రెట్టింపు అవుతుందంట.



ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకుని బాగా గిలకొట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల, జుట్టుకి అప్లై చేసుకోవాలి.



దాదాపు 30 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఎగ్ మాస్క్ జుట్టు పెరుగుదలకు, బలానికి అవసరం.


ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది. జుట్టు పెరుగుదల, మందాన్ని మెరుగుపరుస్తుంది.



ఉల్లిపాయ రసం తలకు రాసుకుని 30 నిమిషాల నుంచి గంట వరకు అలాగే ఉంచాలి.
వారానికి రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.


కలబంద జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఆకుల నుంచి జెల్ తీసి తలకు నేరుగా అప్లై చేసుకోవాలి.


ఇది వారానికి 2-3 సార్లు పునరావృతం చేస్తే మంచిది.



కొబ్బరి నూనెలో తేమ లక్షణాలు ఉన్నాయి.
దీనితో రెగ్యులర్ గా స్కాల్ఫ్ మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగుపరచడంలో సహాయపడుతుంది.


తలస్నానం చేయడానికి 30 నిమిషాల ముందు రాసుకుని మసాజ్ చేస్తే జుట్టు కుదుళ్లు బలపడతాయి.



గ్రీన్ టీ జుట్టు ఆరోగ్యంపై అనేక ప్రయోజనాలు చూపిస్తుంది. ఒక కప్పు గ్రీన్ టీ చేసుకుని దాన్ని చల్లబరచాలి.



దాన్ని తలకి పట్టించి కాసేపు ఉంచుకోవాలి. షాంపూ చేసి శుభ్రం చేసుకోవాలి.