పొడవాటి జుట్టు కోసం ఇలా చేయండి



ఆధునిక కాలంలో కాలుష్యం, ఒత్తిడి వంటి వాటివల్ల జుట్టు పొడవు పెరగడం లేదు, సరికదా విపరీతంగా రాలిపోతుంది.



పొడవాటి జుట్టు కావాలనుకునేవారు కొన్ని చిట్కాలు పాటించాలి.



మందార పువ్వులు, ఆకులతో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకొని పొడవుగా పెరిగేలా చేసుకోవచ్చు.



మందార ఆకులను, మందార పువ్వులను తీసుకొని మిక్సీలో మెత్తని పేస్టులా చేసి, కొబ్బరి నూనె వేసి తలకు మర్ధనా చేయాలి.



అలా చేశాక గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది.



మందార పువ్వులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వడకట్టి, ఆ నీటితో తల స్నానం చేస్తే చుండ్రు పోతుంది.



ఉల్లిపాయలు, మందార ఆకులు కలిపి చేసే పేస్ట్ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.



శ్రద్ధ వహిస్తేనే జుట్టు పొడవు పెరుగుతుంది.