బెండకాయను ఎందుకు తినాలంటే...



బెండకాయను వారంలో రెండు మూడు సార్లు కచ్చితంగా తినాలి. వాటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.



బెండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల పొట్ట నిండిన భావన ఎక్కువ కాలం ఉంటుంది.



బెండకాయ త్వరగా అరిగిపోతుంది. కాబట్టి అజీర్తి సమస్యలు రావు.



దీనిలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. శాచురేటెడ్ కొవ్వులు ఉండవు.



దీనిలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. ఎంత తిన్నా బరువు పెరగరు.



బరువు తగ్గాలనుకున్న వారు తమ ఆహారంలో బెండకాయను చేర్చుకోవాలి.



దీన్ని తినడం వల్ల గ్యాస్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.



వేసవిలో బెండకాయ తినడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.