మద్యం తక్కువ తాగినా ప్రమాదమే



తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదని అనుకుంటారు.



ఆల్కహాల్ ఎంత తక్కువ మొత్తంలో తీసుకున్నా కూడా శరీరంపై చాలా ప్రభావం పడుతుంది.



ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆల్కహాల్‌ను విషపూరితమైన, సైకోయాక్టివ్ పదార్థంగా పేర్కొంది.



దీనిలో ఇథనాల్ అధికంగా ఉంటుంది. ఇది పొట్ట, మెదడు, గుండె, పిత్తాశయం, కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుంది.



రోజూ ఎంతో కొంత మొత్తంలో మద్యం తాగితే కాలేయం వాపు వస్తుంది. ఇది కాలేయం సిర్రోసిస్ సమస్యకు కారణం అవుతుంది.



ఆల్కహాల్ గుండె కండరాలను దెబ్బతీస్తుంది. కార్డియోమయోపతి వంటి సమస్యలకు కారణమవుతుంది.



మద్యం సేవించే వారికి న్యుమోనియా, క్షయవ్యాధి వచ్చే అవకాశం ఉంది.



ప్రపంచవ్యాప్తంగా 8.1% మందిలో క్షయ వ్యాధులు ఆల్కహాల్ వల్లే వస్తున్నాయి.