డార్క్ చాక్లెట్లలో ఆ లోహాలు



సాధారణ చాక్లెట్ తో పోలిస్తే, డార్క్ చాక్లెట్ చాలా ఆరోగ్యకరమైనది. ఈ విషయాన్ని పోషకాహార నిపుణులు కూడా చెబుతారు.



కానీ, డిసెంబర్ 2022లో జరిగిన కన్స్యూమర్ రిపోర్ట్స్ పరిశోధన ప్రకారం, డార్క్ చాక్లెట్లలో రెండు రకాల భారీ లోహాలు ఉన్నట్టు తేలింది.



ఆ భారీ లోహాలను సీసం, కాడ్మియంలుగా గుర్తించారు. అందుకే డార్క్ చాక్లెట్లను తినడం అంత సురక్షితం కాదని చెబుతోంది ఈ పరిశోధన.



వినియోగదారుల నివేదికల పరిశోధనలో వివిధ బ్రాండ్‌లకు చెందిన 28 డార్క్ చాక్లెట్ బార్ లను పరిశీలించారు.



వాటిలో 23 చాక్లెట్లలో సీసం, కాడ్మియంల ఉనికి ఉన్నట్టు తేలింది.



సీసం, కాడ్మియం వంటివి భూమిలో లభించే లోహాలు. ఇవి నేల, నీటిలో కలిసిపోయి ఆహరంలోకి ప్రవేశిస్తాయి.



చాక్లెట్లను తయారుచేసే కోకో బీన్స్ పెరుగుదల సమయంలో నేల ద్వారా వాటిలోకి ప్రవేశించి వాటిలో స్థిరపడతాయి.



డార్క్ చాక్లెట్‌ను ఆస్వాదించడానికి ఉత్తమ మార్గం ఆర్గానిక్ కోకో పౌడర్‌ని తయారు చేయడం.