జ్యూసీగా ఉండే మామిడి పండు తినగానే అమ్మాయిలకు మొహం మీద లావుగా మొటిమలు దర్శనమిచ్చేస్తాయి. మామిడి వేడి చేసే పదార్థం అందుకే అలా అవుతుందని కొంతమంది వాదన. నిజానికి మామిడి పండ్లు తింటే మొటిమలు ఏర్పడటానికి కారణం ఫైటిక్ యాసిడ్. ఇది శరీరాన్ని వేడి చేస్తుంది. మొటిమలు రాకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. వాటిని తినడానికి ముందు కనీసం రెండు గంటల పాటు నీళ్ళలో నానబెట్టుకుని తింటే మంచిది. అలా చేయడం వల్ల ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. అవి ఉత్పత్తి చేసే వేడిని తగ్గిస్తుంది. నానబెట్టకుండా తినడం వల్ల మొటిమలు, అసిడిటీ, గుండెల్లో మంట వస్తాయి. వీటిని నీటిలో నానబెట్టడం వల్ల సహజ వేడి తగ్గి శరీరానికి, చర్మానికి సురక్షితంగా ఉంటుంది. మామిడి పండు తినడం వల్ల వచ్చే వేడిని తగ్గించేందుకు ఒక గ్లాసు డైరీ పాలు లేదా వీగన్ పాలు తాగితే మంచిది. సీజనల్ ఫ్రూట్ మామిడి పండ్లు ఖచ్చితంగా తినాల్సిందే. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అధిక రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. మహిళలు, పిల్లలు మామిడి పండ్లు తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడొచ్చు. జీర్ణ సమస్యలను అధిగమిస్తుంది.