అత్యంత చవకగా దొరికే పండ్లలో అరటి పండు ఒకటి. ఆకలి కష్టాలు తీర్చే అద్భుతమైన పండు ఇది.

అరటిపండు నుంచి రోజువారి అవసరాలకు సరిపడిన పొటాషియంలో 9 శాతం, మూడు గ్రాముల ఫైబర్ కూడా అందుతుంది.

ఒక్క అరటి పండులో విటమిన్ B6, విటమిన్ C, కార్బోహైడ్రేట్లతోపాటు 100 క్యాలరీలు ఉంటాయి.

రోజూ ఒక అరటి పండు వారం పాటు తిన్నపుడు కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గిపోయినట్టు గమనించారు.

రోజుకో అరటి పండు వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.

రోజూ ఒక అరటి పండు తీసుకుంటే షుగర్ క్రేవింగ్స్ గణనీయంగా తగ్గాయని కొందరు డయాబెటిక్స్ చెబుతున్నారు.

తొందరలో ఉన్నపుడు అరటిపండు మంచి బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్. తక్కువ క్యాలరీలతో ఆరోగ్యవంతమైన స్నాక్ గా కూడా చెప్పుకోవచ్చు.

All Images Credit: Pexels