అవకాడో క్రమం తప్పకుండా తీసుకుంటే చాలా లాభాలున్నాయట.

గుండె ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల అవకాడోతో కార్డియోవాస్క్యూలార్ సమస్యలు నివారించబడుతాయి.

అవకాడోతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అవకాడోతో ఇంకెన్ని లాభాలున్నాయో తెలుసుకుందాం.

అవకాడోలో విటమిన్లు, కాపర్, మెగ్నీషియం, పోటాషియం, బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి.

ఫైబర్, ఫోలేట్, పోటాషియం, మెగ్నీషియం, మోనోసాచూరేటెడ్ కొవ్వులతో పుష్టికరమైన ఆహారం అవకాడో.

అవకాడో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. కనుక ఇది టైప్ 2 డయాబెటిక్స్ కు మంచి ఆహారం.

అవకాడో తిన్నపుడు చాలా సమయం పాటు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. కనుక బరువు తగ్గాలని అనుకునే వారికి మంచి ఆప్షన్.

అవకాడోల్లోని ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

All Images Credit: Pexels