అరటికాయలో ఉండే ఆరోగ్యరహస్యాలు ఊహకందనివి. అరటిలో దాగి ఉన్న సుగుణాలు తెలుసుకుందాం.

చవకగా దొరికే ఈ ఫలం పీచుపదార్థం, పోటాషియం తో పోషక భరితం.

పండిన అరటి కంటే అరటికాయ లో చక్కెరలు తక్కువ. అదనంగా పెక్టిన్, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి.

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి. వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ.

పెక్టిన్, సంక్లిష్ట కార్బోహైడ్రేట్ల వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. తక్కువ క్యాలరీల వల్ల బరువు తగ్గేందుకు మంచి ఆహారం.

విటమిన్ సి, బీటా కెరోటిన్, ల్యూటిన్, జియాక్సింథిన్ వంటి ఫైటోన్యూట్రియెట్ల వల్ల ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను నివారిస్తాయి.

విటమిన్ సి వల్ల ఇమ్యూనిటి బలపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది.

పోటాషియం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. గుండె లయబద్ధంగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది.

All Images Credit: Pexels