సూర్యగ్రహణం మన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

భూమి, సూర్యుడి మధ్యకి చందమామ వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

అక్టోబర్ 25,2022న సాయంత్రం 4.20 నుంచి భూమిపై గ్రహణం ప్రారంభమవుతుంది.

సూర్య గ్రహణం ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందని నమ్ముతారు ఎంతోమంది.

గ్రహణ సమయంలో సూర్యుడిని నేరుగా కళ్లతో చూస్తే కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. రెటీనా కణాలు నశించి చూపు కూడా తగ్గిపోతుంది.

గ్రహణం రోజు కొంతమంది చాలా బలహీనంగా మారిపోతారు. గ్రహణం వారి శక్తిని క్షీణించేలా చేసిందని అంటారు.

గ్రహణ సమయంలో తింటే జీర్ణసమస్యలు మొదలవుతాయని అంటారు.

మూడ్ స్వింగ్స్ కూడా గ్రహణం రోజు అధికంగా ఉంటాయని చెబుతారు.

అందుకే గ్రహణ కాలంలో ఏమీ తినకూడదు, తాగకూడదు, ఏ పనులు చేయకూడదని చెబుతారు.