మగవారికీ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా? రొమ్ము క్యాన్సర్ కేవలం మహిళలకే వస్తుందని అందరి నమ్మకం. చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే.. రొమ్ము క్యాన్సర్ మగవారికి కూడా వచ్చే అవకాశం ఉంది. మగవారిలో 60 ఏళ్లు దాటిన పురుషుల్లో రొమ్ముల్లో క్యాన్సర్ కణితులు పెరిగే ఛాన్సులు ఉన్నాయి. వారసత్వంగా కూడా మగవారికి రొమ్ము క్యాన్సర్ రావచ్చు. హార్మోన్ థెరపీ చేయించుకున్న పురుషుల్లో కూడా ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరిగి ఈ క్యాన్సర్ రావచ్చు. అలాగే ఛాతీ ప్రాంతంలో రేడియేషన్ థెరపీ చేయించుకున్నవారు కూడా రొమ్ము క్యాన్సర్ రావచ్చు. ఊబకాయంతో బాధపడే వారిలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాలేయం వ్యాధి ఉన్న వారిలో కూడా ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.