దీపావళికి టేస్టీ గోధుమ హల్వా



గోధుమ పిండి - ఒక కప్పు
నీళ్లు - రెండు కప్పులు
బెల్లం తురుము - ఒక కప్పు
యాలకుల పొడి - అర స్పూను
నెయ్యి - అరకప్పు
జీడిపప్పులు - అర కప్పు

ఒక కళాయిలో నెయ్యిని వేసి గోధుమపిండిని కలిపి వేయించాలి.

అందులో బెల్లం తురుము వేసి కలపాలి. బెల్లం కరిగాక మిశ్రమాన్ని బాగా కలపాలి.

ఆ మిశ్రమంలో మరిగించిన నీళ్లు కలపాలి.

పిండి కళాయికి అతుక్కోకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి.

యాలకుల పొడి, వేయించిన జీడిప్పులు వేసి కలపాలి.

హల్వాలా చిక్కగా అయ్యే దాకా కలిపి స్టవ్ కట్టేయాలి.

ఓ ప్లేటుకు నెయ్యి రాసి హల్వా మిశ్రమాన్ని అందులో వేసి ముక్కలుగా కోసుకోవాలి.