దీపావళి స్పెషల్ స్వీట్... పేనీలు

దీపావళికి తెలంగాణ స్పెషల్ వంటకం పేనీలు.

చాలా మంది దీపావళి నాడు అమ్మవారికి పేనీల పాయసం చేసి పెడతారు.

అందుకే దీపావళి వచ్చిందంటే పేనీల అమ్మకాలు పెరిగిపోతాయి.

వెలుగుల పండుగ రావడానికి రెండు నెలల ముందు నుంచే అమ్మకాలు జోరుగా సాగుతాయి.

కిలో 110 నుంచి 350 రూపాయల దాకా నాణ్యతను బట్టి రేట్లు ఉన్నాయి.

వీటిని ప్రత్యేకంగా ఎక్కువసేపు వండక్కర్లేదు. పాలు, పంచదార, పేనీలు కలుపుకుంటే చాలు.

పేనీలను బంధువులకు బహుమతులుగా పంపిస్తారు చాలా మంది.

పిల్లలకు ఎంతో నచ్చే స్వీట్ ఇది.