నోట్లో కరిగిపోయేలా నేతి మైసూర్ పాక్



శెనగపిండి - ఒక కప్పు
పంచదార - ఒకటిన్నర కప్పు
నెయ్యి - ఒక కప్పు
నూనె - అర కప్పు
పాలు - అర కప్పు

స్టవ్ మీద పెద్ద కళాయి పెట్టి అందులో చక్కెర, పాలు పోసి పాకం తీయాలి.

ఆ పాకంలో శెనగపిండి వేసి కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి.

పిండి కాస్త చిక్కగా అయినప్పుడు అందులో నెయ్యిలో కొద్దికొద్దిగా పోస్తూ కలుపుకోవాలి.

అలాగే నూనె కూడా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి.

కోవాలా దగ్గరగా అయ్యాక స్టవ్ కట్టేయాలి.

ఒక పళ్లానికి నెయ్యి రాసి, వేడిగా ఉన్నప్పుడే మొత్తం పిండిని పళ్లెంతో వేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

వేడి తగ్గాక ఒక డబ్బాలో వేసుకుంటే పదిరోజుల పాటూ నిల్వ ఉంటాయి.