ముందుగా బియ్యాన్ని శుభ్రమైన నీటిలో అరగంట నానబెట్టి, వాటిని రెండుసార్లు బాగా క‌డిగి ఆ నీటిని వ‌డ‌క‌ట్టాలి.

ఆ నీటిని చర్మానికి పట్టిస్తే కణాలు పునరుజ్జీవింపబడతాయి.

ఈ నీళ్లు ముఖానికి అప్లై చేయడం మృత‌క‌ణాలు తొలిగి ప్ర‌కాశ‌వంతంగా త‌యార‌వుతుంది.

ఆ నీటిలో కాటన్ వస్త్రాన్ని ముంచి, ముఖంపై అద్దుకోవాలి.

బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నవారు రెగ్యూల‌ర్ గా వాడితే మంచి మార్పు ఉంటుంది

బియ్యం నీళ్లను రెగ్యులర్ గా వాడితే మీ ముఖంపై క్రమంగా మొటిమలు తగ్గుతాయి.

జుట్టు పెరుగుదలను మెరుగుపరచడానికి ఈ నీరు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఈ నీటిలో విట‌మిన్ ఏ, విట‌మిన్ బీ, విట‌మిన్ సీ, ఎమైనో ఆమ్లాలు ఉంటాయి.

ఈ నీళ్లు జుట్టుకు మంచి కండీష‌నర్ గా ప‌నిచేస్తాయి.

అందుకోసం ఈ నీటిని జుట్టు కుదుళ్ళకు పట్టించాలి.

Image Source: image credit : pexels

ఒక అర గంట త‌ర్వాత‌ హెడ్ బాత్ చేస్తే హెయిర్ సిల్కీ గా ఉంటుంది.