హైహీల్స్ వేసుకుంటే వచ్చే సమస్యలు ఇవే


హైహీల్స్ వేసుకోవడం ఫ్యాషన్‌గా మారిపోయింది.



హైహీల్స్ అప్పుడప్పుడు వేసుకుంటే ఫర్వాలేదు కానీ రోజూ గంటల పాటూ వాటితో ఉండడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.



మీ కాళ్లకు, తుంటి భాగానికి కూడా హైహీల్స్ హాని కలిగిస్తాయి. మడమల భాగంపై తీవ్రంగా ప్రభావం పడుతుంది.



కాళ్లపై, శరీరంపై ఒత్తిడిని కలుగుచేసే హైహీల్స్ దూరంగా ఉండడమే మంచిది.



హైహీల్స్‌ను ఎక్కువ సమయం పాటూ వేసుకోవడం వల్ల వెన్ను కింద భాగంలో నొప్పి మొదలవుతుంది.



నిత్యం ధరించడం వల్ల నొప్పులు పుట్టడం, ఒక్కోసారి పుండ్లు పడడం కూడా జరుగుతుంది.



నరాల వ్యవస్థపై కూడా ఇవి ప్రభావాన్ని చూపిస్తాయి.ముఖ్యంగా కాళ్లు, పాదాల్లోని నరాలపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి.



మడమల ప్రాంతంలో తిమ్మిర్లు రావడం, జలదరింపుగా అనిపించడం ఎక్కువవుతుంది.



హైహీల్స్ వల్ల వెన్నుముకపై తీవ్ర ప్రభావం పడుతుంది. వెన్ను నొప్పి మొదలైతే ఆసుపత్రి చుట్టు తిరగక తప్పదు.